ధనలాభం కోసం ఇంటి ప్రవేశ ద్వారం వున్న గోడకు తెలుపు, లేత నీలం, గులాబీ వంటి రంగులు వేసుకుంటే మంచిది. నలుపు, నిండు ఎరుపు రంగులు మాత్రం ఉపయోగించకూడదు. బీరువాలో డబ్బు ఉంచే లాకర్‌ను ప్రతిబింబించేలా ఒక అద్దాన్ని బీరువా తలుపు లోపలివైపు అమర్చితే ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్న కుండీ పెట్టుకొంటే డబ్బు, పెట్టుబడులకు ఎలాంటి నష్టం ఉండదు.
ఇంట్లో పగిలిన గాజు వస్తువులు, కిటికీ అద్దాలు లేకుండా చూడాలి. గాజు వస్తువులను ఎప్పుటికప్పుడు శుభ్రం చేయాలి. ఇంట్లో సూర్య కిరణాలు పడే కిటికీ వద్ద స్పటికాల మాల వేలాడదీస్తే కాంతి శక్తి తరంగాలు ఇల్లంతా ప్రవహించి ఆర్ధిక లబ్ధి చేకూరుతుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూస్తే.. ఆదాయానికి లోటుండదు.