నవరాత్రి రోజుల్లో ఆరాధించే పరాశక్తి సాక్షాత్తూ పరబ్రహ్మానికి, పరిపూర్ణతకు ప్రతిరూపం. ఆ తల్లి ఆనతి మేరకే త్రిమూర్తులు సైతం సృష్టి, స్థితి, లయలను వహిస్తున్నట్లు దేవీ భాగవతం చెబుతోంది. ఈ కాలంలో ఈ నవ దుర్గల ఆరాధన జీవితంలో పరిపూర్ణత్వాన్ని అందిస్తుంది.
అందుకే... సృష్టి, స్థితి లయకారిణి, అజ్ఞాన నాశినీ, భయహరిణీ, దుఃఖ నివారిణి, ఆత్మశక్తి ప్రదాయిని అయిన దుర్గామాతను శరణువేడితే దుర్గతి పోయి, సద్గతి ప్రాప్తిస్తుంది. అందుకే దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయి.