సమష్టి కృషితో లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంత ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ముఖ్యమైన చెల్లింపులు అలక్ష్యం చేయకండి. మీ అలక్ష్యం ఇబ్బందికి గురిచేస్తుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగ విధులపై దృష్టి సారించండి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
అన్ని విధాలా అనుకూలమే. స్నేహసంబంధాలు బలపడతాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. మంగళవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. అనవసర జోక్యం తగదు. గృహమార్పు కలిసివస్తుంది. సంతానానికి శుభయోగం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. చిట్స్, ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి. సోమవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ప్రియతముల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మొండిగా ముందుకు సాగుతారు. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. భాగస్వామిక ఒప్పందాల్లో మెలకువ వహించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. శుభకార్యానికి హాజరవుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కష్టం వృధాకాదు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. సంతానం అత్యుత్సాహం వివాదాస్పదమవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. సంకల్పబలంతో ముందుకు సాగండి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వ్యవహారాల్లో మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపునకు అవకాశం లేదు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. శుక్రవారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఇతరుల బాధ్యతలు చేపట్టిన ఇబ్బందులెదుర్కుంటారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. కొందరి రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. సంస్థల స్థాపనకు అనుకూలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనవసర విషయాల జోలికి పోవద్దు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. సన్నిహితుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. ఓర్పుతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. దైవదర్శనాలు ప్రశాంతంగా సాగుతాయి.
పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. కలిసివచ్చిన అవకాశాలు జారవిడుచుకోవద్దు. తప్పుచేశామన్న భావం రానీయకండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. దంపతుల మధ్య స్వల్ప కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారానుకూలత, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలించకపోవద్దు, సోమవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. చేపట్టిన పనులు త్వరితగతిన సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది.
ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారాల జోలికి పోవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. గురువారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. అనవసర ఒత్తిళ్లకు గురికావద్దు. లక్ష్యానికి చేరువలో ఉన్నారు, ఆశావహదృక్పధంతో యత్నాలు సాగించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. యాదృచ్ఛికంగా తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.