సెప్టెంబర్ 2వ తేదీ సోమవతి అమావాస్యను జరుపుకుంటారు. పితృ దేవతల ఆరాధనకు ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. సోమవతి అమావాస్యనాడు అన్నదానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే గోధుమలు, బియ్యం, పప్పులు వంటి వాటిని నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి దానం చేయవచ్చు. సోమవతి అమావాస్య రోజు కొత్త వస్త్రాలు లేదా తక్కువగా ఉపయోగించిన దుస్తులను దానం చేయడం మంచిది.
సోమవతి అమావాస్యనాడు నెయ్యి దానం చేయడం మంచిది. సోమవతి అమావాస్య రోజు ఉప్పును కూడా దానం చేయవచ్చు. సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంది. అలాగే చెట్టుకు నీరు సమర్పించాలి.
సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఈరోజున అన్ని గ్రహాలు చంద్రుడితో కలిసి శివుడిని పూజిస్తాయని నమ్ముతారు. అందుకే ఈరోజు శివారాధన కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.