ఆ వినాయకుడి ప్రతిమకు పూర్తిగా పసుపును రాసి అలకరించాలి. తదుపరి శుక్రవారం చందనం రాసి పూజకు ఉపయోగించాలని.. ఇలా పూజలందుకునే వినాయకుడు అనుకున్న కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. శ్వేతార్క గణపతిని శుభ్రమైన నీటితో కడిగి, తర్వాత దానిపై ఎర్రని వస్త్రం మీద పెట్టి పూజ చేయాలి. పూజలో ఎర్ర చందనం, అక్షతలు, ఎర్రపూలు సింధూరం ఎరుపు రంగు ఉండే వస్తువులే ఎక్కువగా వాడాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వీటితో ఒక నాణాన్ని దక్షిణంగా సమర్పించి గణేశ మంత్రాలతో పూజ చేయాలి.
అందుకే.. స్వయంభూ దేవాలయాల్లో తెలంగాణగణపతిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలోని 29దేవతమూర్తులతో ప్రత్యేక దంపత్ వాహన సమేత నవగ్రహ క్షేత్ర నిలయంగా భాసిల్లుతోన్న కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్క గణపతి క్షేత్రం ఒకటి. ఈ ఆలయంలోని వినాయకుడిని దర్శించుకునే వారికి ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.