పూజగదిని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులలో నిర్మించుకోవచ్చు. పూజ గదిని ఏవైపున నిర్మించుకున్నా.. తూర్పు వైపు చూస్తూ పూజ చేస్తే మంచిది. ఉత్తర దిక్కున దేవతా విగ్రహాలు, ఫోటోలు, యంత్రాలు ఉంచితే దక్షిణ దిక్కును చూస్తాయి కాబట్టి.. ఆ దిక్కుల్లో వాటిని వుంచకూడదు. పడమర తూర్పు ముఖంగా దేవుని పటాలు, విగ్రహాలు, యంత్రాలు ఉంచి కూడా పూజ చేసుకోవచ్చు.