Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

సెల్వి

శనివారం, 19 జులై 2025 (20:57 IST)
Mithun Reddy
ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. 
 
ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి శనివారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు.. అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు.
 
మరోవైపు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇటు ఏపీ హైకోర్టు, అటు సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించటంతో మిథున్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 
 
ఇక ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ రెడీ చేసింది సిట్. ఈ చార్జ్ షీట్‌లో వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులతో పాటు వందకుపైగా ఎలక్ట్రానిక్ పరికరాల్ని స్వాధీనం చేసుకుంది. 11 మంది వాంగ్మూలం, స్టేట్ మెంట్ రికార్డులతో పాటు కుంభకోణం కేసులో స్వాధీనం చేసుకున్న అన్నీ పత్రాలను ఛార్జ్ షీట్ తో జతపరిచింది సిట్.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన సిట్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్

రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం

(File Visual) https://t.co/2fqWLKr6zI pic.twitter.com/4Y6zsAVzO2

— BIG TV Breaking News (@bigtvtelugu) July 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు