యజ్ఞం ఎక్కడైనా చేయవచ్చు. చేసే యాగాన్ని బట్టి స్థలం ఎంతమేరకు అవసరం అనేది ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామందికి యజ్ఞాలపైన ఒక అవేర్‌నెస్ ఏర్పడుతుంది. ఇది మన సనాతన భారతీయ ఆర్య సంస్కృతిలోని గొప్ప ప్రక్రియ. నేటి ఆధునిక భారతం కాదు. ప్రపంచం కూడా అర్థం చేసుకుని పర్యావరణ ప్రక్షాలనా కార్యం మన ఋతు పవనాలను వేగవంతం చేసి క్రమబద్ధం చేసే మహోన్నత శాస్త్రీయ ప్రక్రియ.
మీరు ఇంటి వద్ద స్థలం ఉన్నా చేసుకోవచ్చు. అయితే యజ్ఞకుండాలను ఒక సమయంలో యజమాని హస్త ప్రామాణిక కొలతలో నిర్మించాల్ని ఉంటుంది. స్థలం తప్పక దిశానుకూలంగా చేసుకుని నిష్టతో చేసే వారితో చేయించడం చేసేవాళ్లు త్రికరణ శుద్ధిగా చేయడం అవసరం. ఏదైనా కృత్రిమంగా కాకుండా సహజసిద్ధ యజ్ఞ హవిస్సులు వాడడం, యాగశాల నిర్మాణం జాగ్రత్తగా చేయడం తెలుసుకుని చేయాలి.