29-12-2019 నుంచి 04-01-2020 మీ వార రాశిఫలాలు

శనివారం, 28 డిశెంబరు 2019 (15:40 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
గృహం సందడిగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు అందుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ఖర్చులు విపరీతం. కొంత మొత్తం ధనం అందుతుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆది,  సోమ వారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవచ్దు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. దైవదర్శనాలలో చికాకులు తప్పవు. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. శ్రమ ఫలిస్తుంది. కానుకలు, ప్రశంసలు అందుకుంటారు. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. బుధ, గురువారాల్లో చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ శ్రీమతి వైఖరి చికాకుపరుస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బాధ్యతలు అధికమవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులకు కానుకలు అందజేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. మంగళ, శుక్రవారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు వేగవంతమవుతాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. విమర్శలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వస్త్ర వ్యాపరాలు లాభసాటిగా సాగుతాయి. పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనయోగం. పోటీల్లో విజయం సాధిస్తారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష 
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ ఆలోచనలు నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. బంధుమిత్రుల కలయిక, వాహనయోగం, ధనలాభం ఉన్నాయి. ఉత్సాహంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పోటీల్లో విజయం సాధిస్తరు. దైవదర్శనంలో అవస్థలెదుర్కొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
వేడుకల్లో పాల్గొంటారు. బంధుత్వాలు బలపడతాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో పొదుపు తగదు. పెద్దల సలహా పాటించండి. ఆస్తి వివాదాలు, రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. అయినవారికి సాయం అందిస్తారు. ఆది, సోమవారాల్లో ప్రముఖులను సందర్శనం వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. ఆధిక్యత ప్రదర్శించవద్దు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. మీ పథకాలు ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు ధనప్రాప్తి. పోటీలు, పందాలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఉత్సాహంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రశంసలు, కానుకలు అందుకుంటారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బుధవారం నాడు అనుకోని సంఘటనలెదురవుతయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనయోగం. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఈ వారం అన్ని రంగాల వారికి ఆశాజనకమే. సమస్యలు సద్దుమణుగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. కొత్తవారిని విశ్వసించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు ధనయోగం. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. దైవదర్శనాలు, ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట. 
ఇబ్బందులు క్రమంగా సర్దుకుంటాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ప్రముఖులను కలుసుకుంటారు. గృహంలో మార్పులు చేర్పులు చేపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలివేయండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. చీటికి మాటికి అసహనం చెందుతారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. రాబోయే ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు ఉంటాయి చేతిలో ధనం నిలువదు. కనిపించకుండా పోయిన వస్తువుల లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. గృహమార్పు అనివార్యం. గురు, శుక్రవారాల్లో పరిచయంలేని వారితో జాగ్రత్త. కుటుంబ విషయాలు ఏకరవు పెట్టొద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. క్రీడాపోటీలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం. ధనిష్ట 1, 2 పాదాలు. 
దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు మెరుగుపడుతాయి. ఖర్చులు విపరీతం. అవసరానికి డబ్బు సర్దుబాటవుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శనివారంనాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యగోస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదామార్పు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పదాలు. శతభిషం, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు. 
మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో రాణిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలువదు. గృహం సందడిగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో పనులతో సతమతమవుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వేడుకలను ఘనంగా చేస్తారు. కానుకలు, శుభాకాంక్షలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలు ఉంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రాప్తి, న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదర్శనం అనుకూలిస్తుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి. 
కానుకలు, శుభకాంక్షలు అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అనుకోని సంఘటనలెదురవుతాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు సానుకూలమవుతాయి. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. వాహనచోదకులకు దూకుడు తగదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు