05-04-2020 నుంచి 11-04-2020 మీ వార రాశిఫలాలు

శనివారం, 4 ఏప్రియల్ 2020 (20:43 IST)
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శకునాలను పట్టించుకోవద్దు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. మొండిగా వ్యవహరించవద్దు. అవకాశాలు కలిసివస్తాయి. మంగళ, బుధవారాల్లో ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యుల సందర్శనీయం వీలుపడదు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
గృహమార్పు కలిసివస్తుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. సమర్థతను చాటుకుంటారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ కించపరచవద్దు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. గురువారం నాడు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. క్రీడాపోటీల్లో రాణిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పరిస్థితుల అనుకూలత అంతంతమాత్రమే. శుక్ర, శనివారాల్లో మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. పంతాలు పట్టింపులకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై మరింత దృష్టిసారించండి. సహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. వైద్య, రవాణా రంగాలవారికి పురోభివృద్ధి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. రావలిసిన ధనం అందుతుంది. ఆది, సోమవారాల్లో గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. సంతానం చదువులపై దృష్టిపెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు హోదామార్పు, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. లావాదేవీలు, సంప్రదింపులు సంతృప్తినిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అపరిచితులను విశ్వసించవద్దు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించండి. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. నోటీసులు అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
సంప్రదింపులకు అనుకూలం. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఖర్చులు అధికం. వేడుకలు ఘనంగా చేస్తారు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. పనులు సానుకూలమవుతాయి. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. శ్రీమతి సలహా పాటించండి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరిచండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధాన. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. పరిస్థితులు సమక్రంగా మెరుగుపడతాయి రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. శనివారం నాడు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వేడుకలకు హాజరవుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పనులు హడావుడిగా సాగుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు ఖర్చులు అధికం. సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సమర్థతను చాటుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ఆది, సోమవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. స్వల్పఅస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ ప్రమేయంతో ఒకరికి  ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు, ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం 
మనోధైర్యంతో వ్యవహరించండి. వ్యవహారానుకూలత ఉంది. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఊహించని ఖర్చులు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మంగళ, బుధవారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. పనులతో సతమతమవుతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలివేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిల్వవుండదు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో శుభవార్త వింటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గురువారంనాడు పనులు ముందుకుసాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పంతాలు పోవద్దు. గృహమార్పు అనివార్యం. గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాల్లో శ్రేయస్కరం. మార్కెట్ రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అనుకూలతలు అంతంతమాత్రమే. శ్రమ, ఒత్తిడి అధికం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిపెడతారు. పనులు మధ్యలో నిలిచిపోతాయి. సన్నిహితుల హితవు మంచి ప్రభావం చూపుతుంది. ఆశావహ దృక్పథంతో వ్యవహరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. శుభకార్యానికి యత్నాలుసాగిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఈ వారం ధనలాభం. వస్త్రప్రాప్తి ఉన్నాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. రిటైర్డు ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు