ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాలనుకూలత ఉంది. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ నిర్మాణాలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త పథకాలు అమలుచేస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. వైద్య, కంప్యూటర్ రంగాలవారి ఆదాయం బాగుంటుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
కొన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడుతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ఆటంకాలెదురైన పనులు పూర్తి చేయగల్గుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. బుధు, గురు వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యవహా ఒప్పందాలకు సరైనా సమయం. చాకచక్యంగా వ్యవహరించాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. వ్యవహార దక్షతతో రాణిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తికాగలవు. మంగళ, శుక్ర వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. విమర్శలు, అభియోగాలకు దీటుగా స్పందిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్టాక్‌మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులకు అదుపు ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం దూకుడు అదుపు చేయండి. శనివారం అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఊహించని సంఘటనలెదురవుతాయి. నగలు, కీలక పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలసు స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ధన, పదవీయోగం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అసాధ్యమనకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సూచనప్రాయంగా తెలియజేయండి. గృహం సందడిగా ఉంటుంది. పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.
వ్యవహారాలనుకూలత ఉంది. అంచనాలు ఫలిస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మంగళ, బుధ వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఊహించని సంఘటనలెదురవుతాయి. ప్రముఖలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
ఈ వారం పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. నోటీసులు అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పనులు హడావుడిగా సాగుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. వృత్తి ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
అప్రమత్తంగా వ్యవహరించాలి. భేషజాలు, పంతాలకు పోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనుల ప్రారంభంలో అవాంతరాలెదుర్కుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. పెద్దల ఆరోగ్యం కుదటపడుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ శ్రీమతి వైఖరి చికాకుపరుస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అంచనాలు ఫలిస్తాయి. వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. గురు, శుక్ర వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నగదు, విలువై వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. వేడుకలకు హాజరవుతారు. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు.
వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ వాక్కు ఫలిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ధనలాభం ఉంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శనివారం నాడు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. చిన్ననాటి పరియస్తులను కలుసుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు ఆలోచన కార్యారూపం దాల్చుతుంది. అనుకూల పరిస్థితులున్నాయి. పనులు సానుకూలమవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆది, మంగళ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. కీలక సమావేశాల్లో పాల్కొంటారు. నిర్మాణాలు, మరమ్మత్తులు పూర్తవుతాయి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. చిరువ్యాపారులకు ఆశాజనకం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వాహన చోదకులకు దూకుడు తగదు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు బుధవారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అరమరికలు తగదు. లౌక్యంగా వ్యవహరించాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పర్మిట్లు, లెసైన్సుల రెన్యువల్‌లో మెళకువ వహించండి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. వీడియోలో...