24-03-2019 నుంచి 30-03-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

శనివారం, 23 మార్చి 2019 (19:25 IST)
సింహంలో రాహువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శుక్రుడు, వక్రి శని, రవి, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 24న సంకట హర చతుర్థి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం కొంత మేరకు అనుకూలం. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు ముగింపుదశలో మందకొడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అప్రమత్తంగా ఉండాలి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సంప్రదింపులు వాయిదా పడుతాయి. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరి చికాకుపరుస్తుంది. సామరస్యంగా మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. అనేక పనులతో సతమతమవుతారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. న్యాయ, సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. చెల్లింపులు, సంతాకాల్లో జాగ్రత్త. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకలకు హాజరవుతారు. ఆత్మీయుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుకూలం. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమ అధికం. ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. సహాయం అడిగేందుకు మనసు అంగీకరించదు. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. మంగళ, బుధ వారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించండి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు మూలక ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. గురు, శుక్ర వారాల్లో ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. విదేశాల్లోని సంతానం యోగక్షేమాలు సంతృప్తినిస్తాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు..    
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనప్రాప్తి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
కార్యాసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. బంధువులతో విభేదిస్తారు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. క్రమంగా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఆది, సోమ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పరిచయం లేని వారిని నమ్మవద్దు. కొత్త విషయాలపై దృష్టి పెడతారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. కొత్త ఖర్చులెదురవుతాయి. ధనసహాయం అర్థించేందుకు మనసు అంగీకరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలెదురవుతాయి. మంగళ, బుధ వారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులు కోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. వేడుకలకు హాజరవుతారు. ఆత్మీయుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చువలసి వస్తుంది. కోర్టు వాయిదాలు అసహానం కలిగిస్తాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. గురు, శుక్ర వారాల్లో ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తులను కలుసుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుభకార్యంలో పాల్గొంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు.   
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. విద్యా ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. శని, ఆది వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శుభకార్యాని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మంగళ, గురు వారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక అయిన వారికి సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. శుక్ర, ఆది వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. వాహనం ఇతరులకివ్వవద్దు. వీడియో చూడండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు