బుధవారం రోజున లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామిని మంగళ, బుధవారాల్లో పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. శత్రుబాధ వుండదు. దుఃఖం తొలగిపోతుంది. మంగళ, బుధవారాల్లో సంధ్యా సమయంలో నృసింహ స్వామిని దర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి.
ఈ వారాల్లో పానకం, వడపప్పు దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలా కుదరని పక్షంలో శ్రీరామనవమికి, నృసింహ జయంతికి పానకం నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టాలి. మంగళ లేదా బుధవారాల్లో నృసింహ స్వామిని పూజించి..
''మాతా నృసింహ, పితా నృసింహ
భ్రాతా నృసింహ, సఖా నృససింహ
విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ
స్వామి నృసింహ, సకలం నృసింహ''
అని ఎవరైతే స్వామిని తలుచుకుని మనసారా పూజిస్తారో వారికి జీవితంలో దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి. పగతో కూడిన ప్రతీకారం తీర్చుకోవాలనే మనసత్త్వం నృసింహ ఆరాధన ద్వారా తొలగిపోతుంది. కష్టాలను తొలగించే దేవుడు నృసింహ స్వామి. కోపాన్ని నశింపజేస్తాడు. ఇంకా దుఃఖాలు వేధించిన వేళ.. నృసింహ స్వామిని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.