ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని కూడా నమ్మకం. పితృదోషం ఉన్న వారు ఈరోజున ప్రత్యేక పూజలు, తర్పణాలు విడవడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు కలిగి దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం.
ఇక ఈరోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, శక్తి, ఆత్మ విశ్వాసం మెరుగుపడుతాయి. ఆదివారం అమావాస్య రోజు పూర్వీకులకు పిండ ప్రధానం ఇవ్వడం వల్ల వారి ఆత్మ శాంతి కలుగుతుంది.
అలాగే.. ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో ఎర్రటి పూలు, బెల్లం, కుంకుమ వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం శుభప్రదం.
అలాగే.. ఆదివారం అమావాస్య రోజు దానం చేయడం కూడా చాలా మంచిది. నువ్వులు, గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.