పూజగదిలో పెట్టకూడని ప్రతిమలు, ఫోటోలు ఏంటంటే? (video)

బుధవారం, 3 జూన్ 2020 (17:09 IST)
పూజగదిలో కొన్ని ప్రతిమలను, ఫోటలను వుంచకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. పూజగది శాస్త్రాలు చెప్పే ఫోటోలను, ప్రతిమలను మాత్రమే వుంచాలి. అలాకాకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే పూజగదిలో వుంచాల్సిన ప్రతిమలు, ఫోటోల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. 
 
అవేంటంటే? శనీశ్వరుడి ఫోటోలను ఇంట్లోని పూజగదిలో వుంచకూడదు. నవగ్రహాల పటాలను, ప్రతిమలను అస్సలు వుంచకూడదు. ఇకపోతే.. నటరాజ స్వామి ఫోటోను, ప్రతిమను ఇంట్లో వాడకూడదు. గుండు తీసుకుని వున్న దేవతల ఫోటోలు, కోపంతో చూస్తుండే ఫోటోలు, కాళికాదేవి ఫోటోలు ఇంట వుంచడం కాదు.. పూజగదిలో తప్పకుండా వుంచకూడదు. 
 
కుమార స్వామి తలకు పైగా వేలాయుధం వుండే ఫోటోలు, ప్రతిమలు ఇంట్లో, పూజగదిలో వుంచకూడదు. రుద్రతాండవం చేసే శివుని ఫోటోలు, తపస్సు చేసే ఫోటోలు ఇంట వుంచకూడదు. ఇవే కాకుండా విరిగిన దేవతల ప్రతిమలు వుండకూడదు. పాతబడిన దేవతల ఫోటోలు, చిరిగిన ఫోటోలను వుంచి ఇంట్లో పూజచేయడం కూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు