13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

రామన్

బుధవారం, 13 ఆగస్టు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ రోజు అనుకూలదాయకం. మీ కష్టం ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. ప్రముఖుల సందర్శం అనుకూలిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, అర్ధ, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. పురస్కారాలు అందుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. పరిచయస్తులు మీ ఆలోచనలను నీరుగారుస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు విపరీతం. ఆహ్వానం అందుకుంటారు. జూదాలు, బెట్టింగ్ ల జోలికిపోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. నిస్తేజానికి లోనవుతారు. ఏ పనీ చేయబుద్ధి కాదు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొంత మొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనులు సాగవు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. బంధువులతో సంభాషిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు ముందుకు సాగవు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మొండి బాకీలు వసూలవుతాయి. మానసికంగా కుదుటపడతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఆత్మీయుల సలహా పాటించండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. అస్వస్థతకు గురవుతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. రోజులు భారంగా గడుస్తున్నట్టనిపిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కుటుంబీకుల మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. యత్నాలు విరమించుకోవద్దు. ఓర్పుతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. ముఖ్యుల కలయిక వీలుపడదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు