అలాగే తీసుకునే గణపతి ముఖంలో చిరునవ్వు ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు అలాంటి ఇంట్లో కూడా సుఖ, శాంతులు పెరుగుతాయి. ముఖ్యంగా గణపతికి చతుర్భుజాలు ఉండేలా చూసుకోవాలి. ఒక చేతిలో లడ్డూ, మరో చేతిలో కమలం, ఇంకో చేతిలో శంఖం, నాలుగో చేతిలో ఏదైనా ఆయుధం ఉండాలి. అలాడే వినాయకుడికి తొండం ఎల్లప్పుడూ ఎడమవైపుగా ఉండేలా చూసుకోవాలి. కేవలం ఎడమవైపు తొండం ఉండే విగ్రహన్ని లేదా చిత్రపటాన్ని కొనుగోలు చేయాలి.
గణేషుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి దిక్కుగా ఉండాలని, అందుకే ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారు. ఇలాంటి విగ్రహలను కేవలం గుడిలో మాత్రమే ఏర్పాటు చేస్తారు.
ఈ విధంగా ఉన్న గణపతికి ప్రతిరోజూ చాలా నిష్టగా పూజలు, ధూపదీప నైవేధ్యాలు అందిస్తారు. కాబట్టి ఇంట్లో పెట్టుకోకూడదు, గుడిలో మాత్రమే పెట్టుకోవచ్చు. గణపతి ముందు ముఖం సంపదను సూచిస్తే... వెనుక ముఖం పేదరికాన్ని సూచిస్తుంది.
కాబట్టి వినాయకుని వెనుక ముఖం ఇంటి బయట ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఇంటి దక్షిణ దిశలో గణేష విగ్రహన్ని ఎట్టిపరిస్థితుల్లో పెట్టరాదు. తూర్పుదిశ లేదా పశ్చిమదిశలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్నానాల గది గోడకు కూడా వినాయకుడి విగ్రహన్ని పెట్టకూడదు. అలా చేస్తే అరిష్టమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.