నాగ పంచమి రోజున ఏ చెట్టు నాటాలి.. కన్యారాశి మామిడి చెట్టును?

సెల్వి

శుక్రవారం, 9 ఆగస్టు 2024 (09:34 IST)
నాగపంచమి రోజున రాశిని, లగ్నాన్ని బట్టి ఒక చెట్టుని నాటాలని, ఇది వారి జీవితంలోని దోషాలను తొలగించి సంతోషాన్నిస్తుంది. నాగ పంచమి నాడు మేషరాశి వారు వేప చెట్టును, వృషభరాశివారు మామిడి చెట్టును, మిథునరాశి వారు మామిడి లేదా రావి చెట్లను, కర్కాటకరాశి వారు వేప లేదా మర్రి చెట్టును, సింహరాశి వారు వేపా లేదా మామిడి చెట్టును పెట్టాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇక కన్యారాశి వారు మామిడి చెట్టును, తులా రాశి వారు వేపచెట్టు లేదా శమీ వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు వేప చెట్టును లేదా రావి చెట్టును, ధనుస్సు రాశి వారు మామిడి చెట్టును లేదా రావి చెట్టును, మకర రాశి వారు శమీచెట్టును, కుంభ రాశి వారు మర్రిచెట్టును లేదా శమీ చెట్టును, మీన రాశి వారు రావి లేదా మామిడి లేదా వేప చెట్టును పెట్టాలని చెప్తున్నారు. 
 
ఇలా చేస్తే నాగ దోషం నుండి, గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుందని సూచిస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ రాత్రి 9.56 నిమిషాలకు నాగ పంచమి ఘడియలు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రాత్రి 11.59 నిమిషాల వరకు కొనసాగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు