శనిగ్రహ మార్పు కారణంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. బుధవారం సాయంత్రం 5.20 గంటలకు శనిదేవుడు మకరరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించారు. ఈ పరివర్తనం కారణంగా మార్చి 6, 2026 వరకు కుంభరాశిలో శనిదేవుడు ఉంటాడు.
నవగ్రహాలలో వృత్తి గ్రహం అయిన శని, డిసెంబర్ 20వ తేదీ బుధవారం మకర రాశి ధనిష్టా నక్షత్రం 2వ పాదము నుండి కుంభ రాశి ధనిష్టా నక్షత్రం 3వ పాదానికి పరివర్తనం చెందాడు. మార్చి 6, 2026 వరకు కుంభరాశిలో ఉంటాడు. ఈ శని పరివర్తనం.. అనే మార్పుతో 12 రాశుల స్థానాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విధంగా, ప్రస్తుతం మీనరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు. తదుపరి శని సంచారానికి ముందు ఏప్రిల్ 26, 2025 నుండి కుంభం, సింహరాశిలోకి రాహుకేతువులు వెళతారు.
గురు గ్రహం 30 ఏప్రిల్ 2024 వరకు మేషరాశిలో, 1 మే 2024 - 13 మే 2025 నుండి వృషభరాశిలో, 14 మే 2025 నుండి మిథునరాశిలో సంచరిస్తారు. శని, రాహుకేతువుల మార్పుతో ఈ రాశులకు లాభమో చూద్దాం..