సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తుంటారు. దేవుళ్లకు నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడుతుంటారు. అంతేకాకుండా దిష్టి తీసి వాహన చక్రాలతో తొక్కిస్తారు. ఇలా చేస్తే మేలు జరుగుతుందని ఆశిస్తారు. పులుపుగా ఉండే నిమ్మకాయ, కారం నిండి ఉండే పచ్చిమిర్చిలను వాహనాలకు, దుకాణాల మధ్య వేలాడదీస్తారు.
శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ఆనవాయతి అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రహాలలో ఎర్రని, ఉద్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రం నమ్మకం. కుజునికి ఆదిదేవుడు హనుమంతుడు. అలానే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం విగ్రహానికి సంబంధించినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుకుంటూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయాలు కడతారు.