కలియుగంలో కార్యసిద్ధికి దుర్గాదేవిని ఆరాధించాలి. మంగళవారం దుర్గాదేవికి రాహుకాలం సమయంలో నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రాహుకాలంలో చివరి అరగంటను అమృతఘడియలు అంటారు. ఆ సమయంలో దుర్గమ్మకు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపమెలిగించడం ద్వారా సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి.
ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరు గంటల్లోపు దుర్గకు దీపం వెలిగించడం ద్వారా సకలాభీష్టాలు నెరవేరుతాయి. ఇంకా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, రుణాల బాధను తొలగించుకోవాలంటే.. ప్రశాంతత చేకూరాలంటే చేయాల్సిందంతా.. సమీపంలోని ఆలయంలో నేతి దీపం వెలిగించాలి.
అంతేగాకుండా శివాలయాల్లో వుండే బిల్వ వృక్షాన్ని 21 సార్లు ప్రదక్షణలు చేసి.. ఇబ్బందులు విన్నవిస్తే.. మంచి ఫలితాలు వుంటాయి. ప్రదోషకాలంలో వృషభ రూఢ మూర్తిగా, మహేశ్వరుడు ఉమాదేవితో దర్శనమివ్వడాన్ని వీక్షిస్తే.. వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితం వుంటుంది.