ప్రతిరోజూ పూజకు ముందు స్వామికి నైవేద్యంగా శుభ్రమైన పండ్లు, ఆహార పదార్థాలను వుండవచ్చు. అలాగే నైవేద్యాన్ని పూజాగదిలోని దేవతలకు సమర్పించడం కోసం రాగి చెంబు పాత్రలో నీటిని నింపి వుంచడం మంచి ఫలితాలను ఇస్తుంది.
పూజగదిలో కుండలోనూ, చెంబు పాత్రల్లోనూ నిండుగా నీటిని వుంచాలి. పూజ చేసేటప్పుడు కాసేపు ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో ఇష్టదేవతను స్తుతించాలి. ఇష్టదేవతా మూలమంత్రాన్ని పఠించాలి. అలా మీరు చెప్పే ఆ మంత్ర సానుకూలత చెంబులో మనం పెట్టే నీటిలో ఆవహిస్తుంది. అందుకే పూజకు అనంతరం.. పూజ కోసం కుండల్లో, రాగి పాత్రల్లో వుంచిన నీటిని ప్రసాదంగా స్వీకరిస్తారు.
రాగి లేదా కుండల్లో పూజగదిలో వుంచే పాత నీటితోనే మళ్లీ నైవేద్యం సమర్పించడం కూడదు. పూజ చేసేటప్పుడు గంట కొట్టడం ద్వారానూ దుశక్తులు ఇంటి నుంచి వెలుపలికి వెళ్లిపోతాయని విశ్వాసం. రోజూ గంట కొట్టి పూజ చేసేవారింట శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యం, సకల సౌభాగ్యాలు చేకూరుతాయి.
కానీ పూజగదిలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇనుముతో కూడిన వస్తువులను ఉపయోగించకూడదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇనుముకు యముడు అధిపతి. అందుచేత ఇనుముతో చేసిన విగ్రహాలు, పాత్రలు పూజగదిలో వుండకుండా చూడాలని వారు సూచిస్తున్నారు. ఇనుము ప్రతికూల ఫలితాలను ఇస్తుందని.. వెండి, ఇత్తడి, మట్టితో చేసిన వస్తువులను, పూజా ప్రతిమలను ఉపయోగించవచ్చునని.. పండితులు సెలవిస్తున్నారు.