ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపునకు ఆస్కారం లేదు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కీలక సమావేశం, సభల్లో పాల్గొంటారు.
సంప్రదింపులతో తీరిక ఉండదు. కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు వాయిదా వేసుకుంటారు. కొత్త సమస్య ఎదురవుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు.
వ్యవహార దక్షతతో రాణిస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. సభ్యత్వాల స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పనుల్లో ఒత్తిడి అధికం. లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వేడుకకు హాజరుకాలేరు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ఫలించవు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. నోటీసులు అందుకుంటారు.
రావలసిన ధనం అందుతుంది ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. వాహనదారులకు దూకుడు తగదు.
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పత్రాలు, నగదు జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం చేస్తారు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోండి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. కొంత మొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది.
లావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు ప్రయోజనకరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బాధ్యతలు చేపడతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. ఖర్చులు సామాన్యం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సంతానానికి శుభం జరుగుతుంది.