పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే ఏమిటి?

గురువారం, 27 మార్చి 2008 (18:48 IST)
వ్యక్తిత్వానికి ప్రత్యేక నిర్వచనం అంటూ ఉండదనేదే సమాధానం స్త్రీల పవృత్తి వారిని నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. వారిలోని కొన్ని ప్రత్యేక లక్షణాలే వారికి చెప్పలేని ఆకర్షణను, సొగసును ఇస్తాయి. బోలెడంత హుందాతనాన్ని తెచ్చిపెడతాయి.

ఒక్క మాట చెప్పాలంటే ఆయా వ్యక్తుల వ్యవహార శైలి, నడవడి వారి జీవితాన్ని మన కళ్లెదుట ఆకర్షింపజేస్తుంది. అదే పరిపూర్ణ వ్యక్తిత్వమంటే.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే చక్కని రూపలావణ్యాలు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది బాహ్య సౌందర్యం. పైగా పుట్టుకతోటే ఈ అంద చందాలనేవి అబ్బుతాయి.

మహిళల విషయానికి వస్తే ఆపేక్ష, ఆప్యాయతలు, ఎదుటివారి అవసరాన్ని గుర్తించి తదనుగుణంగా సాయపడే నైజం వారికి జన్మతః అబ్బిన ప్రత్యేక గుణాలు. ఇలాంటి సహజ లక్షణాలకు చక్కని ఆత్మవిశ్వాసం.. చిత్తశుద్ధి... నిర్మలమైన మనస్తత్వం తోడైతే ఇక ఆ స్త్రీమూర్తి సొగసు చూడతరం కాదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న స్త్రీ మూర్తి ప్రత్యేకంగా కనపడడం సహజం..

వెబ్దునియా పై చదవండి