కొందరు చిన్న పిల్లలు మరీ గారాబం చేస్తుంటారు. వారిపై ప్రేమతో వారు అడిగిందల్లా కొనిస్తుంటారు. కాని ఏదిపడితే అది కొనివ్వడం, ఎక్కడపడితే అక్కడ వారి ఆగడాలకు హద్దే ఉండదు. దీనికి కారణం పిల్లలపై తల్లిదండ్రులు చూపించే ప్రేమే కారణం. కాని పిల్లలకు సంస్కారం కూడా నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉంది.
పిల్లలకు ప్రేమను పంచడంకూడా ఓ హద్దుంటుంది. ఒక వయసు వచ్చేంతవరకు వారికి ప్రేమతోపాటు సంస్కారాన్నికూడా నేర్పిస్తుండాలి. సమాజం గురించి వారికి తెలియచెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లలై సంపూర్ణ అధికారం ఉంటుంది కాబట్టి వారికి సభ్యత, సంస్కారం, ఇతరులపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకునే తీరును వారికి నేర్పించాలి.
** దీనికి మీ మునుపటి తరాలవారిని అనుకరించాల్సిన అవసరం లేదు. కాని వారి మార్గదర్శకత్వంలో నడిస్తే చాలా మంచిదంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.