మహిళ మనస్సుకు కళ్లెం వేయడం అవసరం. మహిళ అందానికి ప్రతిరూపం, ఆశలకు నిలువెత్తు నిదర్శనం. అంటువంటి మహిళ మనసుకు కళ్ళెం లేకపోతే కష్టమే మరి. మహిళ మనస్సు సున్నితమైంది. ఆశ, నిరాశలు ఆమె మనస్సును ఛిద్రం చేస్తాయి. తద్వారా ఆమె ప్రశాంతతను కోల్పోతుంది. అందుకనే మనసుకు కళ్లెం వేసి అణకువైన వాటినే ఎదురుచూడాలి.
మహిళల మనస్సు విషయంలో వస్తువుల కొనుగోలు, ఫంక్షన్లు, పార్టీలకు వెళ్ళే నిర్ణయాలు తదితర అంశాలను మాత్రమే కాకుండా మహిళల మానసిక, శారీరక సంబంధాల విషయంలో కూడా మహిళ మనస్సుకు కళ్లెం వేయడం మంచిది.
నేటి తరం మహిళలు మనస్సుకు ఎటువంటి కళ్లెం లేని రీతిలో తమకు తోచిన రీతిలో నడుస్తూ... పలు తప్పటడుగులు వేస్తున్నారు. వీటి విషయంలోనే కాకుండా ముఖ్యంగా లైంగిక భావోద్రేకాల విషయంలో సైతం జాగ్రత్త పడాలి. ఈ విషయంలో మహిళల మనస్సుకు కళ్లెం వేయనట్లయితే ఇతరులతో అక్రమ సంబంధాలు దారి తీయడం ద్వారా జీవితాలు తారుమరయ్యే ప్రమాధం ఉంది. అందుచేతనే మహిళ మనస్సుకు కళ్లెం అవసరం.