ప్రశాంత జీవితం కోసం మహిళలు కొన్ని నియమాలు పాటిస్తే సరి. మీ ఆదాయములో కొంత శాతమైనా నెల చివరలో మీ చేతిలో ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం మీ ఆదాయంలో కనీసం ఇరవైశాతం అన్నా పొదుపు చేయాలి.
పొదుపుని నెలలో మొదటి ఖర్చుగా భావించాలి. అవసరమైన వస్తువుల జాబితాను తయారుచేసుకుని షాపింగ్‌కు వెళ్ళడం మంచిది. ఏ వస్తువైనా స్వయంగా వెళ్ళి కొనడమనే పద్ధతిని అలవర్చుకోవాలి. నౌకర్లును పంపరాదు. నౌకర్లపై ఆధారపడకూడదు.
రాబడికంటే తక్కువ ఖర్చు చేస్తూ ఆదాచేయడం వైపు మొగ్గుచూపాలి. సాధ్యమైనంతవరకు అప్పుచేసే పరిస్థితులను కల్పించుకోకూడదు. వాయిదా పద్ధతిలో వస్తువులను కొనడం ఖచ్చితంగా లాభకరం కాదు.
ఆడంబరాలకు పోకూడదు. ప్రక్కవారితో ప్రతివిషయంలో పోటీ పడకూడదు. ప్రతి విషయంలో వారిస్థాయి తెలుసుకుని మెలగవలెను. ఎంతఖర్చు పెడుతున్నాము అని కాదు ఎంత మిగులుతుంది అనేదే ముఖ్యమని గమనించండి.