పవి పుష్పంబగు, నగ్ని మంచగు, నకూపారంబు భూమీ స్థలం బవు శత్రుండతి మిత్రుడౌ, విషము దివ్యౌహారమౌ నెన్నగా అవనీ మండలిలోపలన్ శివ శివేత్యాభషణోల్లాసికిన్ శివ! నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!
భావము: ఈ భూమిపై "శివ శివ" అని పలికే వారికి అన్ని శుభములే జరుగుతాయి. శివభక్తుని నశింపజేసేందుకు ఎవరైనా వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పటికీ, అది అతనికి అలంకారమవుతుంది. సముద్రం భూమిగా మారుతుంది. శత్రువులు మిత్రులవుతారు. విషం కూడా అమృతమవుతుంది.