1918వ సంవత్సరంలో సమాధి చెందేంతవరకు తనను ఆశ్రయించిన భక్తులను ప్రేమానురాగాలతో ఆశీర్వదించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు చూపించేవారు. అత్యవసర సమయంలో బాబాను పిలిచినట్లయితే వెంటనే ఆదుకుంటానని చెప్పడం ద్వారా భక్తుల హృదయాలలో బాబా చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరికి ఆశీర్వచనాలు అందించడమై తన ధ్యేయంగా బాబా ప్రవచించారు.
ఆశ్రితులకు రక్షణ, ప్రమాదాలను నివారించుట, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుట, ప్రజలందరిలో సమైక్య భావనను పాదుకొల్పుట తనను ఆశ్రయించిన వారికి ఆధ్యాత్మిక భావనలను కల్పించడం ద్వారా తాను చేసిన ప్రవచనానికి కార్యరూపం ఇచ్చారు. తన మాటలతో, చర్యలతో సాధకులకు మోక్ష మార్గాన్ని చూపిన ఆధ్యాత్మిక పథ నిర్దేశకుడు సాయిబాబా.