శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాసం... ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, గోవింద నామస్మరణ చేయడం శుభప్రదం.
అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థన చేసి, శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసముంటే సకల సంపదలు చేరువవుతాయని పురాణాలు చెబుతున్నాయి. లేదా ఏకాదశి రోజున మహాభాగవతంలోని "అంబరీషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు కలుగుతుంది.