అని ధ్యానించి మంగళవారం, శుక్రవారం పూట ముత్తైదువులు, కన్యలు ఇంటి ముంగిట దీపం వెలిగించినట్లైతే ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు.
సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న శక్తి వంతురాలైన లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించి, పూజానంతరం గృహమంతా రంగు రంగుల ముగ్గులు పెట్టి, వాటిపై దీపాలను వెలిగించినట్లైతే.. ఆ మహాలక్ష్మీ దేవి కాలిఅందియలు ఘల్లు ఘల్లు మంటు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వాసం. ఇలా ప్రతి మంగళ, శుక్రవారాల్లో మహాలక్ష్మీని నిష్ఠతో పూజించిన వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.