అన్న ఈ శ్లోకమును రథసప్తమి రోజున పఠించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రథసప్తమి పుణ్యకాలమున అందరూ విధిగా పై శ్లోకమును పఠిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వాసం.
అందుచేత రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి సమీప ఆలయాలలో సూర్యదేవునికి విశేషపూజలు చేయిస్తే భోగభాగ్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
ఇకపోతే.. జ్యోతిష్యంలో సూర్యుడికి ప్రముఖ స్థానం ఉంది. ఆయన గ్రహాలంతటికి రాజు కాబట్టి.. రథసప్తమి రోజున ఆయనను స్తుతిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున సూర్యుడికి జరిపే అభిషేకాలు, దాన, జప, అర్చనలు చేసే జాతకులకు గ్రహశాంతి కలిగి సత్ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్కులు అంటున్నారు.