పలుకరిస్తే చాలు.. ముడుచుకుపోతారు.. మరీ అంత బిడియమైతే ఎలా...?
మంగళవారం, 3 జనవరి 2012 (19:49 IST)
WD
వారిలో అన్ని తెలివి తేటలుంటాయి. ఏ పనైనా పక్కగా చేయగలరు. కాని పరిచయాలు, మనుషులతో కలయిక కాడికి వచ్చే సమయానికి కుంచించుకు పోతారు. నోరు తెరలేరు. ఇతరులతో పరిచయమంటేనే వెనుక వెనుకనే ఉంటారు. కాస్త మొహమాటమెక్కువ. అంతే పాళ్ళలో బిడియం కూడా ఉంటుంది.
పైకి చూస్తే వీరిలో స్పందన ఉండదేమో అనుకుంటాం. వాస్తవానికి వీరు అతిగా స్పందిస్తారు. బిడియం మరింత ఎక్కువ అయిన వారు జీవితంలో అనర్థాలు కొని తెచ్చుకుంటారు. వీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఇతరులంతా ఇది తమకు ప్రయోజనకరమని భావించే పరిణామాలకు కూడా వీరు ప్రతికూలంగా స్పందిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏ చిన్న సంఘటనకైనా ఒత్తిడిని కలిగించే హార్మోన్లు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. అందుకే వీరు అనుకూల పనులను కూడా ప్రతికూలంగా భావిస్తారు. ఆందోళనాపరుల్లో మెదడులో ఉండే అమిగ్డాలా అనే విభాగం అతిగా స్పందిస్తుంది. ప్రమాదాలకే కాకుండా క్షేమకరమైన వాటిలోనూ ఇది ఒత్తిడికి లోనవుతుంది.
దీనివల్ల ఒత్తిడి పెరగడమే కాకుండా శారీరక సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. కీళ్లవ్యాధితో పాటు దిగులు, నిరుత్సాహం వంటి మానసిక రుగ్మతలకు, మద్యం ఇతర మాదక ద్రవ్యాలకు లోనయ్యే ప్రమాదం ఉంది. పని భారం వల్లనే ఇలా తయారవుతున్నారని అనుకోవడమ తప్పు. మానసిక వైద్యుడిని కలవడం, అవసరమైతే చికిత్స చేయించుకోవడం చాలా మంచిది.