ఖరీదైన కారు... ఉండేందుకు విలాసవంతమైన బంగ్లా.. అందులో పని మనుషులు.. రత్నాల్లాంటి పిల్లలు.. ఇక ఆ జంటకు ఇంతకంటే కావాల్సిదేముంది? అంతే కదా మరి. అలాంటి పరిస్థితులలో ఎవరైనా అలాగే అనుకుంటారు.. కానీ ఇంట్లో వాళ్ల బెడ్ రూముల్లోకి ఒక్కసారి తొంగి చూస్తే తెలుస్తుంది ఇవన్నీ పైపై మెరుగులేనని. బయటకు చాలా అన్యోన్యంగా ఉన్నట్లు కనిపిస్తారని. బెడ్ రూరంలో మాత్రం ఎవరికి వారే ఎడమొహం పెడమొహం. ఇదీ చాలా రిచ్ ఫ్యామీలల కథా కమామిషు.. దాంపత్య జీవనాన్ని ఎంజాయ్ చేయలేక సతమతమవుతున్నారట.
మానసిక నిపుణలను కదిలిస్తే ఇలా సంఘటనలు కోకొల్లలు. డబ్బు సంపాదించే మెషిన్లలా మాత్రమే పని చేస్తున్నారు తప్ప జీవన సారాన్ని ఆస్వాదించలేకపోతున్నారని తెగేసి చెబుతున్నారు. మోడరన్ మ్యారేజీల్లో ఇలాంటి ధోరణి పెరిగిపోతోందట.. బెడ్ రూముల్లో వీళ్ళు లైంగికానందం పొందలేకపోతున్నారని, ఫలితంగా వంధ్యత్వం, విడాకులు పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయని వారు విశ్లేషించారు.
చాలామంది మద్యం తాగుతూనో, నెట్ లేదా టీవీ చూడడంతోనో, స్నేహితులతోనే ఎంజాయ్ చేస్తూనో గడుపుతుంటారని. దీంతో భార్యాభర్తలమధ్య దూరం పెరిగిపోతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. సెక్స్ అన్నది లేకపోతే ఒంటరిగా ఫీలవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది మరెక్కడో లేదు. మనం నివశిస్తున్న భారతీయ సమాజంలోనే పెరిగిపోతుందని వాపోతున్నారు .