మంచి లీడర్ కావాలంటే? నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి?

గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:38 IST)
చాలా మంది వ్యక్తులు గొప్ప గొప్ప నాయకులు కావాలని కలలుకంటుటారు. వీరిలో కొందరు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తమను తాము మలుచుకుంటారు. అయితే, నాయకులు కావాలంటే ముందుగా ఒక వ్యక్త తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదో గుర్తించాలి. అలాగే వ్యక్తిలోని బలాలు బలహీనతలపై స్పష్టమైన అవగాహన కలిగివుండాలి. అపుడే ఆ వ్యక్తి ఓ మంచి లీడర్ కాగలడు. అసలు నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం. 
 
* ఎల్లవేళలా ఆశావాద దృక్పథం కలిగివుండాలి. 
* తొలుత చిన్న లక్ష్యాలు, ఆ తర్వాత పెద్ద లక్ష్యాలను చేరుకునేలా సాధన వుండాలి. 
* బృందంలోని సభ్యుల ప్రతిభను గుర్తించగలగాలి. వారికిచ్చిన పనులు సక్రమంగా పూర్తి చేస్తున్నారా లేదా అన్నది గ్రహించాలి. 
* బృంద సభ్యులను గౌరవిస్తూ వుండాలి. వారిలోని బలహీనతలు, బలాలను తెలుసుకుని మసలుకోవాలి. 
* బృంద సభ్యులకు ప్రతినిధిగా అంటే వారధిగా ఉండాలి 
* నిర్ణయం తీసుకోవాల్సినపుడు తన నిర్ణయమే చివరిదై ఉండాలి. అప్పుడప్పుడూ బృంద సభ్యుల సలహాలు తీసుకోవచ్చు.
* సృజనాత్మకతను పెంచుకోవాలని టీం సభ్యులను పోత్సహిస్తూ ఉండాలి. 
* అయితే, నాయకుడుగా ఉంటూ కొన్ని పనులు చేయకూడదు. 
* బృందం సభ్యుల ఎమోషన్, దృష్టికోణంతో ఆడుకోరాదు. 
* వారితో భావావేశాలను పంచుకోవడం, విభేదాలను పరిష్కరించడం లాంటివి చేయకూడదు. 
* ఒకవేళ పనిలో ప్రతికూల వాతావరణం ఏర్పడితే బృందసభ్యులను నిందించవద్దు. తప్పు ఎక్కడుందో తెలుసుకుని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు