ఇప్పటిదాకా ప్రాజెక్టులు మంజూరు చేయడమే గానీ తప్ప పూర్తి చేయడంపై దృష్టి సారించలేదు. ఇంకా 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్ల నిధులు అవసరం ఉందన్నారు. రైల్వేలు సామాజిక బాధ్యతను మరువలేదన్నారు. పదేళ్లలో రూ.3700 కోట్లతో 41,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేశామని తెలిపారు. రైల్వేలో విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉందని, అయితే ఆపరేషన్ విభాగంలో మాత్రం వీటిని దూరంగా ఉంచుతామన్నారు.