ఖైదీలకు ఇది చేదువార్త.. నో మటన్.. నో చికెన్

బుధవారం, 14 జూన్ 2023 (08:54 IST)
ఖైదీలకు ఇది చేదువార్త. చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో నిధుల కొరత కారణంగా ఖైదీలకు మాంసాహారం బంద్ అయ్యింది. పురుషుల కారాగారంతో పాటు మహిళా కారాగారంలోనూ ఖైదీలకు రెండు వారాలుగా చికెన్, మటన్ ఇవ్వట్లేదని వార్తలు వస్తున్నాయి.
 
సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు రూ.2 కోట్ల వరకూ బకాయి ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ విడుదల కాకపోవడంతోనే మాంసాహార సరఫరాను బంద్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఖైదీలకు తొలి ఆదివారం మటన్ మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు