చోరీకి గురైన పద్మనాభుడి నేలమాళిగల్లోని ఆభరణాలు..!?

FILE
తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోని రహస్య గదుల్లో భద్రపరిచిన నిక్షేపాలు అదృశ్యమైనట్లు గత మూడేళ్ల క్రితం తిరువనంతపురం హైకోర్టు బృందం ఓ నివేదికలో పేర్కొంది. కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలోని ఐదు నేలమాళిగల్లో వెలకట్టలేని నిక్షేపాలు బయటపడిన సంగతి తెలిసిందే.

వీటి విలువను లెక్కించే పనుల్లో సుప్రీం కోర్టు బృందం నిమగ్నమైన విషయం విదితమే. ఇంకొన్ని వారాల్లో ఐదు నేలమాళిగల్లో లభించిన ఆభరణాల విలువను లెక్కించే ప్రక్రియను సుప్రీం న్యాయ బృందం పూర్తి చేస్తుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆలయంలోని నేలమాళిగల్లో ఉన్న నిక్షేపాలు కొంచెం కొంచెంగా అనేక సార్లు చోరీకి గురైయ్యాయని కేరళ ప్రతిపక్ష నాయకుడు అచ్యుతానంద చేసి వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఇదేవిధంగా గత 2008వ సంవత్సరంలోనే పద్మనాభ స్వామి ఆలయంలో జరగాల్సిన ఓ ఉత్సవం కోసం ఐదు నేలమాళిగల్లోని నగలను బయటికి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తిరువనంతపురం న్యాయబృందం జరిపిన పరిశోధనలో పసిడి బిందెలోని 14 రత్నాలు, పసిడి దారాలు, 44 గాజులు అదృశ్యమైనట్లు తెలిసింది.

వీటికి బదులు ఇనుము, కంచుతో కూడిన ఆభరణాలను అందులో చేర్చడం జరిగిందని న్యాయబృందం తేల్చింది. దీని ప్రకారం ఐదు నేలమాళిగల్లోని నిక్షేపాలు మాయమైయ్యాయని తెలిసింది. తద్వారా అచ్యుతానంద వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది.

వెబ్దునియా పై చదవండి