ఒత్తిళ్లకు గురికావద్దు. కీలక వ్యవహారంలో పెద్దల సలహా తీసుకోండి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అభీష్టం నెరవేరుతుంది. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రతను కోల్పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. లక్ష్యసాధనకు చేరువవుతారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
అవకాశాలను చేజిక్కించుకుంటారు. ధనవ్యయంలో మితం పాటించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త బంధుత్వాలు బలపడతాయి. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు అధికం. పనులు మధ్యలో నిలిపివేయొద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దూరప్రయాణం తలపెడతారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
ధైర్యంగా అడుగు ముందుకేయండి. లావీదేవీలు కొలిక్కివస్తాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. పట్టుదలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. కార్యదీక్షతో లక్ష్మాన్ని సాధిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మధ్యలో నిలిపివేయొద్దు. నోటీసులు అందుకుంటారు. అనవసర జోక్యం తగదు. సంప్రదింపులు ఫలిస్తాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యానుకూలత ఉంది. దీక్షతో శ్రమించి మంచి ఫలితం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు సానుకూలమవుతాయి సేవాకార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.