పద్మనాభుని ఆరో నేలమాళిగను తెరిచి తీరాలి: సుప్రీం కోర్టు

శుక్రవారం, 2 సెప్టెంబరు 2011 (16:14 IST)
FILE
కేరళ తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆరో నేలమాళిగను తెరిచి తీరాలని అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు నిచ్చింది. ఇప్పటికే అనంత పద్మనాభ స్వామి ఐదు నేలమాళిగల్లోని సంపదను లెక్కించిన న్యాయ బృందం, ఆరో నేలమాళిగను కూడా తెరిచి తీరాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఆరో గదిలోని ఆభరణాలను పరిశీలించిన వెంటనే గదిని సీల్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జ్యోతిష్యాన్ని నమ్మకుండా ఆరో గదిలో ఏముందో చూడాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పేసింది.

అయితే ఆరో నేల మాళిగ తలుపులకు నాగబంధం ఉండటంతో ఆ గదిని తెరవడం మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పిన నేపథ్యంలో, సుప్రీం కోర్టు తీర్పుకు రాజవంశీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాకుండా ఆరో గదిని తెరవద్దని రాజవంశీయులు అత్యున్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే రాజవంశీయులు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. కాగా, ఆరో నేలమాళిగను తెరవడం ద్వారా జాతి మొత్తానికి విపత్తు అని జ్యోతిష్య నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి