ఏ రోజు పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం...?

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:04 IST)
రావిచెట్టు ప్రదక్షణ చేసేటప్పుడు.. ఆ చెట్టును తాకవచ్చా.. అనే అనుమానం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అయితే ఈ కథనం చదివి తెలుసుకోండి. వృక్షాలలో రావిచెట్టు దేవతా స్వరూపమని అంటారు. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని అంటారు. త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తుంటారు. అందుకే రావిచెట్టును చూడగానే సహజంగానే పవిత్రమైన భావన కలుగుతుంది.
 
మనసులోని కోరికను చెప్పుకుని రావిచెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించడం వలన కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా రావిచెట్టుకు ప్రదక్షణలు చేయడం వలన సంతానం భాగ్యం కలుగుతుందని అంటారు. అలాంటి రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పురాణాలు చెబుతున్నాయి. 
 
రావిచెట్టు దేవతా వృక్షం కనుక ఇది ఆలయ ప్రాంగణంలో తప్పక దర్శనమిస్తూ ఉంటుంది. రావిచెట్టు అనునిత్యం ఆరాధించవలసిన వృక్షమని పండితులు సూచిస్తున్నారు. ఈ కారణంగానే దేవాలయ ప్రాంగణంలో గల రావిచెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షణలు చేస్తుంటారు. ఏ రోజు పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవసం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకవచ్చని చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు