అలిపిరి అంటే అర్థం ఎవరికైనా తెలుసా..!

సోమవారం, 26 డిశెంబరు 2016 (12:30 IST)
కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి తొలి ప్రవేశమార్గం అలిపిరి. సోపానమార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే. కొందరు ఆడిప్పడి అంటారు. పడి అంటే మెట్టు. ఆడి అంటే అడుగున ఉన్న భాగం. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం.
 
కొందరు అలిపిరిని ఆడిప్పళి అంటారు. పుళి అంటే చింత చెట్టు. అడుగు భాగాన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం. వైష్ణవ క్షేత్రాలలో చింత చెట్టుకు ప్రాధాన్య మెక్కువ. నమ్మాళ్వారుకు చింతచెట్టు కిందనే జ్ఞానోదయమైందని పురాణాలు చెపుతున్నాయి. 
 
కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని అర్థమట. శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహాలయం. ఈ ఆలయం పైకప్పు విడిపోవడంతో పాడైపోయింది. విగ్రహాలు శిథిలమయ్యాయి. చివరకు అదృశ్యమయ్యాయి. ఈ ఆలయంలోని శిల్పకళ చిత్ర విన్యాసాలు చూడవచ్చు.
 
అన్నమయ్య కాలం నాటికీ ఈ ఆలయం ఉండేది. ప్రస్తుతం ఈ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దబడింది. ఇక్కడ చూడదగిన బొక్కసం ఉంది. అలిపిరిలోనే వృత్తాకారపు బండ ఉంది. శిథిలాయంలోని బండ రాగుల రాయిలా ఉంది. ఈ రెండు బండలు అలిపిరిలో చూడవచ్చు.

వెబ్దునియా పై చదవండి