అష్టమి రోజున కాలభైరవుడికి పాలు, పెరుగు, పండ్లు, ఎర్రచందనం , పూలు, పంచామృతం, కొబ్బరికాయ మొదలైన వాటిని సమర్పించండి. నల్ల ఉద్దిపప్పు, ఆవనూనె కూడా దేవుడికి సమర్పించాలి. కాలభైరవ పూజ వ్యాపారంలో, జీవితంలోని ఇతర అంశాలలో అడ్డంకులను తొలగిస్తుందని చెబుతారు.
కాల భైరవుడిని పూజించడం వల్ల రాహు-కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి. పౌర్ణమి తర్వాత వచ్చే ఎనిమిదవ రోజు అయిన అష్టమి, మంగళవారం, ఆదివారం కాల భైరవుడిని పూజించడానికి అనువైన రోజులుగా భావిస్తారు.