శివలింగాన్ని ఇంట్లో వుంచుకోవచ్చా? (video)

మంగళవారం, 15 డిశెంబరు 2020 (10:34 IST)
ఈ రోజుల్లో చాలామందికి ఓ అనుమానం వుంది. అది ఏమిటంటే.. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు అంటా, ఒకవేళ వుంటే రోజూ అభిషేకాలు చేయాలి. లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అనే అపోహ వుంది. శివలింగం గురించి ఎవరుపడితే వారు ఎలా చెపుతారు. చెబితే శివమహాపురాణం చెప్పాలి.
 
శివలింగం గురించి శివ మహాపురాణం ఏం చెపుతుందంటే, బొటనవేలు అంత శివ లింగాన్ని ప్రతి ఇంట్లో వుంచుకోవాలి. శివాలయం లేని ప్రాంతంలో స్మశానం కూడా వుండకూడదు. ఎందుకంటే ఉగ్ర భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి. శివాలయంలో శివలింగం తప్పక వుంటుంది. అంటే, స్మశానంలో కూడా శివలింగం వుంటుంది. స్మశానంలో వుంటే మీ ఇంట్లో వుండకూడదా.. ఎవరుపడితే వారు ఏదేదో చెపుతుంటారు.
 
ఎందుకంటే వాళ్ల అర్థజ్ఞానంతో, వాళ్లు వృద్ధిలోకి రారు ఇంకొకర్ని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక వుంచుకోవచ్చు. ప్రతిరోజూ మంచినీళ్లతో అభిషేకం చేయాలి. లేదంటే ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడకట్టి ఆ నీళ్లతో చేయాలి. ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితి వున్నా, చేయకున్నా ఫర్వాలేదు. అభిషేకం చేసేటపుడు మహామృత్యుంజయ మంత్రం చదవవచ్చు లేదంటే నమశ్శివాయ నమశ్శివాయ అంటూ చేసినా సరిపోతుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు