కోవిడ్ 19 క్లిష్ట సమయంలో సూక్ష్మ వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తోన్న ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌

సోమవారం, 7 డిశెంబరు 2020 (18:14 IST)
కోవిడ్‌ 19 మహమ్మారి కారణంగా సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారవేత్తల ఆదాయం 50%కు పైగా క్షీణంచింది. ఎంఎస్‌ఎంఈ సంస్థలు ఆదాయం, ద్రవ్య లభ్యత లేకపోవడం చేత గణనీయంగా ప్రభావితమయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా భయంకరంగా ప్రభావితమైన రంగాలలో ఆతిథ్య రంగ పరిశ్రమ ఒకటి.
 
అయితే, చిన్న హోటల్‌ యజమానులు సంప్రదాయేతర, నూతన వృద్ధి నమూనాలను స్వీకరించడం ద్వారా ప్రస్తుత సంక్షోభం నుంచి బయట పడటంతో పాటుగా మార్గదర్శకంగానూ నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆతిథ్య రంగ పరిశ్రమలో డిజిటైజేషన్‌ అనేది వేగవంతమయింది. నూతన సాధారణత వేళ తమ కార్యక్రమాలను నిర్వహించడంలో సిద్ధమవుతున్న వేళ తమ వినియోగదారులను ఆన్‌లైన్‌లో చేరడంలో సూక్ష్మ వ్యాపారవేత్తలకు తోడ్పాటునందించడంలో అత్యంత కీలకమైన పాత్రను ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ పోషించింది.
 
ఈ తరహా విజయవంతమైన గాథలలో హరి ప్రసాద్‌ ఒకరు. హైదరాబాద్‌లోని క్యాపిటల్‌ ఓ 7648 శ్రీ నవ్య గ్రాండ్‌ యజమాని ఆయన. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన ఆయన ఓ దశాబ్దంకు పైగా నిర్మాణరంగంలో పనిచేశారు. తన పనిలో భాగంగా అధికంగా ప్రయాణాలు చేసే హరి, వినియోగదారుల అంచనాలు, చక్కటి నాణ్యత, అందుబాటు ధరలలోని వసతి, అసంఘటిత రంగంలోని హోటల్స్‌ అందిస్తున్న ఆఫర్ల నడుమ ఖాళీని గుర్తించారు.
 
హోటలీయర్లతో మాట్లాడటంతో పాటుగా తనదైన పరిశోధన చేసిన హరి, ఆధునిక యాత్రికుల అవసరాలను ఎవరూ తీర్చడం లేదని తెలుసుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఓయో హోటల్స్‌లో ఆతిథ్యం పొందడంతో పాటుగా మృదువైన కార్యకలాపాలు, ఆన్‌లైన్‌ బుకింగ్స్‌, నిర్వహణ పరంగా సాంకేతికత స్వీకరణ పట్ల ఆకర్షితులయ్యారు. దానితో ఓ హోటల్‌తో ఆయన కార్యకలాపాలు ప్రారంభించి ఇప్పుడు నాలుగు హోటల్స్‌ను కంపెనీపై నిర్వహిస్తున్నారు.
 
తన ప్రయాణం గురించి  క్యాపిటల్‌ ఓ 7648 శ్రీ నవ్య గ్రాండ్‌ యజమాని హరి మాట్లాడుతూ, ‘‘వినియోగదారుల మద్దతుతో పాటుగా ఓయో నుంచి లభించిన మార్గనిర్దేశనం కారణంగానే బహుళ హోటల్స్‌ను నిర్వహించగలుగుతున్నాను. తొలి రోజుల్లో అన్ని హోటల్స్‌నూ సందర్శించడంతో పాటుగా కనీసం ఐదుగురు అతిథులతో అయినా మాట్లాడేవాడిని. తద్వారా ఎక్కడ మెరుగుపరుచుకోవాలో తెలుసుకునేవాడిని.  ఓయో సహాయంతో మా సామర్థ్యం వృద్ధి చేసుకోవడమే కాదు, కోవిడ్‌ 19 సంక్షోభ సమయంలో కూడా చక్కగా మా రూమ్‌లను అందించగలిగాం. ఓయో మద్దతుతో మా కాంటాక్ట్‌లెస్‌ చెక్‌ ఇన్స్‌ అవకాశాలనూ కల్పించాం’’ అని అన్నారు
 
ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ఇప్పుడు హరి లాంటి భాగస్వాముల మద్దతుతో తమ అతిథులకు సురక్షిత మరియు నాణ్యమైన వసతి అనుభవాలను అందిస్తుంది. ఏడు సంవత్సరాలలో ఆతిథ్య రంగ చైన్‌, వేలాది మంది సూక్ష్మ వ్యాపారవేత్తలకు తగిన మద్దతునందించడంతో పాటుగా ఉపాధి కల్పనదారులుగానూ మారుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు