చెన్నై నగరంలో వండలూర్ సమీపంలోని రత్నమంగళం అనే గ్రామంలో నిర్మితమైన శ్రీలక్ష్మీ కుబేరుడి గుడి ఎంతో ప్రసిద్ధమైనది. ఈ గుడిని దర్శించుకుంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని ప్రతీతి. సంపదలకు దేవత శ్రీ మహాలక్ష్మి, కుబేరుడు వాటికి నిర్వాహకుడు. కుబేర పూజ అనేది స్థిరమైన సంపదలతో తులతూగడానికి ఈ ఇద్దరికీ చేసే పూజ.
ఈ పూజ వలన సిరిసంపదలు చేకూరడమే కాకుండా పోగొట్టుకున్న పాత సంపద కూడా త్వరగా తిరిగి వస్తుందని నమ్మకం. ఈ పుణ్యక్షేత్రంలో కుబేరుడు ఎడమచేతిలో సంగనిధి కుండ, కుడిచేతిలో పద్మనిధి కుండతో తల్లి శ్రీ మహాలక్ష్మి మరియు సతి చిత్తరిణి (చిత్రలేఖ) సమేతంగా విలసిల్లుతున్నాడు.