కార్తీక మాసంలో చేయాల్సినవి- చేయకూడనవి ఏంటో తెలుసుకోవాలా? అయితే చదవండి.
* కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్ర లేవాలి
* తప్పనిసరిగా నదిలో లేదా బావి నీటిలో అభ్యంగన స్నానమాచరించాలి
* రోజూ ఇంట్లోనే పూజ చేయాలి. ముఖ్యంగా సోమవారాల్లో శివుడిని దర్శించుకోవాలి.
* 30 రోజుల పాటు కార్తీక పురాణం చదవాలి. లేదా విష్ణు సహస్రనామాలు పఠించాలి.
* రోజూ ఉదయం, సాయంత్రం ఇంటి ముందు దీపమెలిగించాలి.
* రోజుకో పూట అన్నం.. రెండు పూటల అల్పాహారం తీసుకోవాలి.
* ఇంకా శివాలయంలో దీపమెలిగిస్తే శుభ ఫలితాలుంటాయి.
* మాంసాహారాన్ని మానేయాలి. ఉల్లి, వెల్లుల్లి చేర్చకూడడు.
* పేద ప్రజలకు చేతనైన దానం చేయాలి.
* ఏకాదశి, పౌర్ణమి, నాగుల చవితి రోజున ప్రత్యేక పూజలు చేయించండి.
* శివాలయంలో ప్రత్యేక అర్చన, అభిషేకాలు నిర్వహించాలి