భగవంతుని పూజలో పువ్వులు చాలా ప్రధానమైనవి. భక్తులు వివిధ రకాల పువ్వులను సేకరించి పూజలో సమర్పిస్తుంటారు. కొంతమంది పూజల కోసమే మెుక్కలను పెంచుతుంటారు. మరికొంతమంది పూజకోసమనే పువ్వులు బయట కొంటుంటారు. అయితే భగవంతునికి సమర్పించే పువ్వుల విషయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించవలసిందిగా ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
దేవునికి సమర్పించే పువ్వులు వాసన లేని పువ్వులుగా, ఘాటైన వాసన కలిగిన పువ్వులు, ముళ్లు కలిగిన పువ్వులు, వాడిపోయిన పువ్వులు, రెక్కలు తెగిన పువ్వులు పూజలకు వాడకూడదు. అంతేకాకుండా పరిశుభ్రమైన, పవిత్రమైన ప్రదేశాల్లో లేని పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు. అలాగే నేలపై పడిన పువ్వులు, పురుగులు పట్టిన పువ్వులు, పూర్తిగా వికసించిన పువ్వులు, ఎడమ చేత కోసిన పువ్వులు కూడా దేవునికి సమర్పించకూడదు.