మహిమాన్వితమైన దేవాలయాలు, ఈ విశేషాలు తెలుసా?

సోమవారం, 25 జనవరి 2021 (22:46 IST)
మన దేశంలో వున్న ఆలయాల్లో కొన్నింటికి విశేషమైన మహిమలు ఉన్నాయని చెపుతారు. ఈ మాటలకు తగ్గట్లు ఆలయాల స్వరూపం, స్థితి కూడా అలాగే గోచరిస్తుంది. అచ్చం మనిషి శరీరం వలె ఉండే ఆలయాలున్నాయి. వాటిలో హేమాచల నరసింహ స్వామి, శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి.
 
అలాగే మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ. ఇక ఛాయా విశేషాల విషయానికి వస్తే.. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ తల్లకిందుల ఆకృతిలో ఒక చోట పడుతుంది. బృహదీశ్వరాలయం నీటిలో తేలే విష్ణువు (టన్నుల బరువుంటుంది ), నేపాల్.
 
తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం, కంచి, చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం ఇలా అన్ని దేవాలయాల్లో ఒక్కో విశిష్టత వుంది. 
 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడుతుంది పూరి ప్రసాదం. ఇవన్నీ మహిమాన్వితాలు. అందుకే భారత గడ్డను పుణ్యభూమి అని సంబోధిస్తుంటారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు