ఉదయం లేవగానే భార్యను అలా చూస్తే ఏమవుతుందో తెలుసా?

గురువారం, 20 జులై 2017 (19:34 IST)
ఉదయం నిద్రలేవగానే చూడకూడని, చూడవలసిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవగానే దేవుడు బొమ్మ చూడటమో లేకుంటే తమకు ఇష్టమైన వారి ముఖం చూడటమో జరుగుతుంది. కొంతమందైతే వాటిని అస్సలు పట్టించుకోరు. కానీ కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశానబ్బా అనుకుంటుంటారు. ఉదయం లేవగానే చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. 
 
ఉదయం లేవగానే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు. నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సాంప్రదాయం. బొట్టులేని ఆడపిల్లను పొద్దునే అస్సలు చూడకూడదట. ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచన్‌లోకి వెళ్ళి సరాసరి పనులు ప్రారంభించేస్తుంటారు. అయితే వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రలను చూడకూడదట. చాలామంది ఇళ్ళలో జంతువుల ఫోటోలను పెట్టుకుంటారు.
 
కానీ పొద్దున్నే క్రూరజంతువుల ఫోటోలు చూడటం మంచిది కాదట. ఉదయం లేవగానే మన అరచేతిని చూసుకుంటే లక్ష్మీప్రసన్నం కలుగుతుందని విశ్వాసం. మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టారు పరమేశ్వరుడు. నిద్ర లేవగానే భూ దేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పనులను ఆ తల్లే భరిస్తుంది కాబట్టి. ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలుపెట్టాలి. అంతేకాదు బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యి, బొట్టుపెట్టుకుని అందంగా సింగారించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచిదట.

వెబ్దునియా పై చదవండి